'The Day That Slipped Away'*
The sun, who stole the turmeric and vermilion
Spread out by the generous old woman,
Comes floating by lazily.
I am filling my heart with the essence of good mornings.
Through the paths traced by birds in the sky,
I keep watch, gazing out —
Like a migratory bird,
Wondering if you might return, or lose your way.
When the cloud-branch, stretched out
From the sky-tree, takes pity
And sheds a few raindrops,
I find relief.
Counting the stars
Visible between white clouds,
Beside an unplucked handful of jasmine flowers,
I become a lotus that has folded shut.
The bamboo, which turns the news
Carried by the wind into a melody
As it settles over my whole body,
Pricks me like you — a sweet wound. I endure it.
Postponing the thirst of my eyelids,
I keep spending the whole watch of the night
In the company of the crescent moon
Dangling at the edge of night.
Having become a sparrow without a nest, a doorway that bears no doors,
With an open heart, I became either longing or failure —
But for the sake of the half that remains, I am becoming patience.
Did you fall prey to an illusion of desire?
Or did you become a victim to the bite of the serpent of time?
Without a single trace of you, I slipped away into the day.
Pitifully, I just turned into another day...
Translate: 10 June 2015.
Original Poem in Telugu “JaaripOyina Roju”
By Vanaja Tatineni.
జారిపోయిన రోజు
పేదరాసి పెద్దమ్మ ఆరబోసిన పసుపు కుంకుమలని
దొంగిలించిన సూరీడు తేలి తేలి వస్తుంటే
శుభోదయాల సారాన్ని మనసు నిండా నింపేసుకుంటున్నా
అంబరాన పక్షులేసిన దారులు గుండా
చూపు సారిస్తూ వలసెల్లిన పక్షిలా నువ్వు
తిరిగి వస్తావేమోనని దారితప్పుతావని
కాపుగాస్తున్నా
ఆకాశపు వృక్షం విస్తరించిన
మేఘపు కొమ్మ జాలి జూపి
కాసిని చినుకులు రాల్చితే సేదదీరుతున్నా
తెలి మేఘాల మధ్యగా
కనబడుతున్న నక్షత్రాలని లెక్కిస్తూ
కోయని దోసెడు జాజి పూల దాపున
మలిగిన కమలాన్ని అవుతున్నా
గాలి మోసుకొస్తున్న కబుర్లని
ఒడలెల్లా ఒదిగి ఓ రవంగా మార్చిన వెదురు
నీలా తీపి గాయమై సలుపుతున్నా సహిస్తున్నా
కనురెప్పల దాహానికి వాయిదా వేసి
రాత్రి కొసన వేలాడే నెలవంకతో
జామంతా సహవాసం చేస్తూనే ఉంటున్నా
గూడు లేని గువ్వనై తలుపులు మోయని గుమ్మానై
తెరిచిన హృదయంతో విరహమయ్యానో విఫలమయ్యానో
కానీ సగం కోసం సహనమవుతున్నా
మోహ బ్రాంతికి గురయ్యావో
కాలసర్పం వేసిన కాటుకి బలి అయ్యావో
జాడ మాత్రం తెలియక రోజులో జారిపోయా
జాలిగా మరో రోజుకి మారిపోయానలాగే ..
01/10/2015.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి