16, జూన్ 2026, మంగళవారం

తండ్లాట/The Agonizing Struggle

 తండ్లాట   - వనజ తాతినేని 


వెలుగొచ్చింది. 

ద్వారం నీడ  రెట్టింపుగా సాగి 

నా సమీపానికి వచ్చింది 

నీడను ఆపలేను 

నిన్ను అవలీలగా ఆపినట్టు. 

ఒకవేళ నేను దగ్గరవుతుంటే 

నువ్వు కుంచించుకుపోతావ్

దూరంపెడుతుంటే చేతులు చాస్తావ్

 దోబూచులాట ఎంతిష్టమైతే మాత్రం

ఎలా వేగాలి నీతో.

ఈ తండ్లాట నాకెందుకసలు!?


16 June 2026. 07:05 am.


English Translation*


*The Struggle*


The light has come.  

The shadow of the doorway, doubled in length,  

Has stretched itself and come near me.  

I cannot stop the shadow  

The way I so effortlessly stopped you.  

If I happen to come closer,  

You shrink away;  

If I keep my distance,  

You open your arms.  

No matter how much you love this game of hide-and-seek,  

How can I keep up with you?  

Why must I endure this struggle at all!?

కామెంట్‌లు లేవు: