6, జూన్ 2026, శనివారం

A Jasmine-Flowered Sky




*A Jasmine-Flowered Sky*  - Vanaja Tatineni



On summer nights, by the time we lay down to sleep out on the open terrace,  

All the daytime flowers would have quickly gone to sleep.  

While all the buds that would become flowers tomorrow were in deep sleep  

In the lap of the branch, as if to brighten the darkness,  

The sky’s canopy would blossom like jasmine flowers.  


The moonlight seemed to have rained down a little extra. Because...  

The moon appeared to have leaned down a bit,  

To listen to the chatter of the night-flowers.  

Back then, the moon would dangle above my head  

Like a cashew my mother fried in ghee, teasing me to reach out and grab it.  


In our street, filled with a darkness as dense as a grove,  

All the unplucked flowers in front of the houses  

Would glow like tiny little lamps, and like the blossoms above,  

They too would show the way to travelers.  


Thinking about flowers that bloom in the darkness,  

I would drift off to sleep wondering,  

"Which flower would it be nice to turn into?"  

By the time I woke up, the daytime flowers would greet me  

And pose a question as well.  

"Tell us, Tell us, which one of us do you want to become in your dream tonight?"  

How could I ever tell them  

That I liked the night-flowers more.


Translate:06 June 2026.

Original Poem “ Jaaji Poola Aakaasam” by Vanaja Tatineni.



జాజిపూల ఆకాశం   - వనజ తాతినేని 


వేసవి రాత్రుళ్లు ఆరు బయట డాబాపై పడుకునే సమయానికి  

పగటి పూలన్నీ త్వరగా నిద్రపోయేవి.

రేపటికి పూలయ్యే మొగ్గలన్నీ కొమ్మ ఒడిలో గాఢ నిద్రలో 

వుండగానే  చీకటిని ప్రకాశవంతం చేయడానికన్నట్లు  

జాజి పూల వలె ఆకాశం పందిరిపై వికసించేవి. 

వెన్నెల కాస్త ఎక్కువగానే కురిసినట్లు ఉండేది.ఎందుకంటే.. 

చంద్రుడు రాత్రి పూల ముచ్చట్లు వినడానికి 

కాస్త వొంగి నట్టే కనబడేవాడు.

అప్పుడు చంద్రుడు మా అమ్మ నేతిలో వేయించిన జీడిపప్పు వలె 

నా తలపై వేలాడుతూ అందుకోమని కవ్వించేవాడు. 


గుబ్బగుయ్యం లాంటి చీకటి నిండిన మా వీధిలోని ఇళ్ళముందు 

కోయని పూలన్నీ చిన్న చిన్న దీపాల్లా వెలుగుతూ పైన వికసించిన

పూలకు మల్లేనే ఇవీ బాటసారులకు దారిని చూపేవి.  


చీకట్లో వికసించే పువ్వులు గురించి ఆలోచిస్తూ

నేను ఏ పువ్వుగా మారిపోతే బాగుండునో అని ఊహలు చేస్తూ 

నిద్రలోకి జారుకునేదాన్ని. నిద్ర లేచే సరికి పగటి పూలు 

స్వాగతంతో పాటు ప్రశ్నని సంధించేవి. 

రాత్రికి వచ్చే కలలో మాలో ఎవరిలాగా మారాలనుకుంటున్నావో 

చెప్పవా  చెప్పవా అని.


రాత్రి పూలంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని ఎలా చెప్పనూ!? 


05 June 2026. 04:56 am. 

©️copyright Vanaja Tatineni. 

 




కామెంట్‌లు లేవు: