The Melody of Fallen Flowers*
Seeing a tree in full bloom,
My wonder sprouts wings and takes flight.
My joy sways, like the nectar
In countless blossoms.
Before a beauty my eyes cannot contain,
My heart kneels.
A _javali_ I once heard in childhood
Dances upon my lips,
Unraveling the silent secret of the flowers.
To me, who plucks no flowers,
The tree, with love, sheds four as a gift.
With a small happiness, I walk away
From an infinite beauty.
Like footprints left upon the dust,
Spring has left a deep imprint within me.
— Vanaja Tatinani
Original Poem in Telugu “Raalu Poola Raagam) by Vanaja Tatineni
English translation: 14 June 2026.
రాలు పూల రాగం - వనజ తాతినేని
నిండా విరిసిన పూల తరువును చూసి నా ఆశ్చర్యం రెక్కలు తొడుక్కుని పరుగులు తీస్తుంది.
నా ఆనందం లెక్కలేనన్ని పూలలోని మకరందం వలె తూగుతుంది.
కన్నులు జీర్ణించుకోలేని సౌందర్యం ముందు
నా మనసు మోకరిల్లుతుంది
చిన్నప్పుడెప్పుడో విన్న జావళి పెదాలపై గంతులేస్తూ పువ్వుల మూగ రహస్యాన్ని విప్పేస్తుంది
పూలను కోయని నాకు ప్రేమతో చెట్టు నాలుగు పూలను రాల్చి కానుక చేస్తుంది.
అల్ప సంతోషంతో అడుగులు వేస్తాను అనంత సౌందర్యాన్ని విడిచి.
ధూళి పై అడుగుల ముద్ర పడినట్లు వసంతం నా లోపల గాఢమైన ముద్ర వేసింది.
01 May 2026. 07:25 am

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి