ఓదార్పు వాక్యం - వనజ తాతినేని
నా స్నేహితురాలు ఆకస్మికంగా సగంగా మిగిలింది. .
ఆమెకు దైర్య వచనాలు చెప్పడానికి వెళ్ళలేకపోయాను.
నా బదులుగా ఒక ఓదార్పు వాక్యాన్ని నిలబెట్టానక్కడ.
ఆమె తన గుండెలోని దుఃఖాన్ని తైలం చేసి
ధైర్యాన్ని ఒత్తిగా వేసి దీపం వెలిగించింది.
చనిపోయిన అతను ధన్యుడు.
మహార్ణవ ఈదులాట నుండి ముక్తి పొందాడని కొనియాడింది.
వాక్యం గర్వంగా రెప రెప లాడుతూ పక్షి వలె మరొక చోటికి ఎగిరిపోయింది.
13 June 2026. 02:35 pm.
English Translation
The Sentence That Became a Bird
My friend was suddenly left half.
I couldn't go to speak words of courage to her.
In my stead, I placed a sentence of solace there.
She turned the sorrow in her heart into oil,
Twisted courage into a wick, and lit a lamp.
She praised the one who died as blessed,
Saying he had attained liberation from the struggle of swimming the great ocean.
The sentence, fluttering proudly like a bird,
Flew away to another place.
— Vanaja Tatinani
('Bilingual')

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి