3, జూన్ 2026, బుధవారం

ఆరోమా ఆఫ్ అరకు

 



ఆరోమా ఆఫ్ అరకు  - వనజ తాతినేని 


అద్భుతమైన సువాసన కలిగిన అరకు కాఫీ పొడి

వడపోతలో టప్ టప్ మనే శబ్దంతో చుక్క చుక్క దిగుతున్నప్పుడే 

మెదడు మేల్కొలుపు రాగం అందుకుంటుంది 

కాఫీ కషాయం లో చక్కెర కలుపుతున్నప్పుడే ఘ్రాణేంద్రియం రెట్టింపు పనిచేస్తుంది 

పాలు పొంగు వచ్చేలోపే రసనేంద్రియం వేగిరపడుతుంది.. 

వేడి వేడి మొదట గుటక కాఫీతో నరం నరం ఉత్తేజితం అవుతుంది. పరిసరాలన్నీ కొత్త అందంతో కాంతులీనుతుంటాయి. 

దశాబ్దాల కిందట విన్న పాట కూడా పెల్లుబికి పెదవులపై గునుగుతుంది

మాటలు మృదుత్వం అద్దుకుని ఇతరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గుటక గుటకకి 

నిన్నటి చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. దేహానికి రెక్కలు కాళ్ళకు చక్రాలు మొలుస్తాయి. ఆశల్ని ఆకాశంలో మరింత ఎత్తుకు ఎగరేస్తాను

ఇనుమడించిన ఉత్సాహంతో దైనందిన జీవితం మొదలవుతుంది. 

సాక్ష్యం కావాలంటే 

కాఫీకి ముందు కాఫీ తర్వాత బేరీజు వేసుకుని చూడండి. అమృతం సేవనానికి పూర్వం పిమ్మట అని పలుకబోతారు.

కాఫీ  నాకు అత్యంత ప్రియమైనది 

ప్రియమైన వాటినన్నింటితో తూకం వేస్తే కాఫీ రుక్మిణీ వేసిన తులసి దళం లాంటిది 

కాఫీ పానీయం అయిపోయింది కాబట్టి 

బతికిపోయింది. 

అదే మనిషి అయితే అపహరించి చిలుకగా మార్చి ఏ చెట్టు తొర్రలోనో దాచి వుండేదాన్ని 

ఎవరికీ దక్కకుండా. 

ఏవండోయ్ కాఫీ మనుషులూ..భయపడకండి

ఇంటి గుమ్మం దాటి లోనికి వచ్చిన వారికి  కాఫీ ఆతిధ్యం కాసిని మనసైన కబుర్లు నా ఇంటి ఆనవాయితీ.  


02 June 2026.  09:00pm



English Translation: 'Aroma of Araku'*

02 June 2026. 

Original Poem ఆరోమా ఆఫ్ అరకు by Vanaja Tatineni 


*Aroma of Araku*  


Araku coffee powder, blessed with a wondrous fragrance,  

When it drips, drop by drop, with a _tap-tap_ sound in the filter,  

My brain picks up its wake-up melody.  

As I stir sugar into the coffee decoction, my sense of smell works double time.  

Before the milk even comes to a boil, my taste buds grow impatient..  


With the first hot sip of coffee, every nerve in my body is electrified. The surroundings begin to shimmer with a new beauty.  

Even a song I heard decades ago wells up and hums on my lips.  

My words gain a softness that mesmerizes others. With every sip,  

The tangles of yesterday unravel, one by one. My body sprouts wings, my feet grow wheels. I fling my hopes even higher into the sky.  

With doubled enthusiasm, daily life begins.  


If you want proof,  

Weigh yourself before coffee and after coffee. You will declare it 'before and after consuming nectar'.  


Coffee is my dearest.  

If I were to weigh it against all my dear ones, coffee would be like the single Tulasi leaf Rukmini placed on the scale - the one that outweighed everything.  


Coffee was lucky it was born a beverage.  

Had it been a human, I would have kidnapped it, turned it into a parrot, and hidden it in the hollow of some tree,  

So that no one else could have it.  


Oh you coffee-people.. don't be afraid!  

Offering coffee hospitality and a few heartfelt conversations to anyone who crosses my threshold is my home's tradition.

*************

శుభోదయం మిత్రులారా! 




కామెంట్‌లు లేవు: