2, జూన్ 2026, మంగళవారం

ఎండమావుల వెంట పరుగిడి

 చిత్రం: తూర్పు - పడమర (కన్నడ డబ్బింగ్ చిత్రం)

గీత రచన:వెన్నెలకంటి

సంగీతం: మనో మూర్తి 

గానం: చిత్ర, యం యం కీరవాణి


ఎండమావుల వెంట పరుగిడి వెళ్ళి పోయే నేస్తమా

గుండెలో మా.. చెలిమి గురుతుగా వుండిపోదువు ప్రాణమా ॥ఎ॥


భూమిపై కురిసింది చంద్రుని గుండె పున్నమి వెన్నెల ॥భూ॥

ప్రేమ కాంతుల కళలు విరిసె నేడు మా నాలుగు కన్నుల ॥ఎ॥ 


సప్తసాగర తీరమావల సుప్త సాగరమున్నది 

మూగ గుండెల ఘోష యాతన ఆశగా పలికేనది॥ఎ॥ 


అమవాసైయినది.. 

అమవాసైయినది పున్నమి ఆ గ్రహణ చంద్రుని నీడలో 

స్నేహ దేహం వీడి  ప్రాణం ఎగిరిపోయిన దారం

॥ఎ॥ 


YouTube లో పాట వినండీ 

1998లో విడుదలైన "అమెరికా అమెరికా" కన్నడ సినిమా యొక్క తెలుగు డబ్బింగ్ చిత్రం,  "తూర్పు పడమర"

ప్రవాస భారతీయుల కథ తో తీసిన సినిమా. 






కామెంట్‌లు లేవు: