6, జూన్ 2026, శనివారం

ఎదురుచూపు /Waiting


 

ఎదురుచూపు    - వనజ తాతినేని 


ఇదిగో.. మహేంద్రుడా! 

కాస్త ఆగవయ్యా.. 

ఐరావతం ఎక్కి ఆఘమేఘాల మీద వెళ్ళబాకు. 

కాస్త మా మాట మన్నించు. 

అతన్ని నిజంగా ఎప్పుడు పంపిస్తావో చెప్పవయ్యా!

అతని కొరకు ఎదురుచూపు. 

వస్తాడో రాడో.. కానీ నిత్యం ఊరిస్తూ ఉంటాడు 

ఇప్పుడేనా,  కాసేపు ఆగాకా అన్నట్టు. 


అసలు అతనెప్పుడూ అర్ధరాత్రే వచ్చి తన పని ముగించుకుని వెళ్ళిపోతాడు. 

అతను వచ్చి వెళ్ళాక ఉదయాలు ఎంత స్వచ్ఛంగా వుంటాయని. 

ఎవరిని చూసినా నవ్వు ముఖంతో కళకళలాడుతూ వుంటారు 

కొత్త ఆశలతో ఇతరులతో ఏవేవో సంభాషిస్తూ వుంటారు 


అతను అవడానికి  ఏకవచనమే కానీ నిత్య బహువచనాలుగా వర్ధిల్లుతాడు. 

సంచారం చేస్తూనే వుంటాడు నచ్చిన తావు కోసం వెదుకుతుంటాడు. 

నచ్చినంతసేపు వుంటాడు. ఏది ఏమైనా.. 

అతను విడవకుండా తడబడకుండా వస్తే బావుణ్ణు.

అమ్మాయి పెళ్ళి చేయడానికి ఆపసోపాలు పడనవసరం లేదు. 

అబ్బాయి చదువు ఒక గాడిన పడుతుంది. 


బిందె నీళ్ళు, బంగారం ధర నానాటికి తాటిమానులా పెరుగుతూనే వున్నాయి. 

అతనొస్తే.. మా ఆరాటం చల్లబడి,  పోరాటం షురూ అవుతుంది. 

అతనొస్తాడని నా ఎదురుచూపు.  జనులందరి నిరీక్షణ కూడా! 


అతను వస్తాడని ఆఖరికి మండుటెండకు బెదరకుండా 

మడి చెక్క కూడా దున్ని సిద్ధం చేసి వుంచాను నారు చల్లాలని. 

అతను ఎప్పుడొస్తాడో కాస్త చెప్పవయ్యా! 

ఆ వరుణుడిని ఎప్పుడు పంపిస్తావో కాస్త త్వరగా చెప్పవయ్యా! 


*********

*ఘరూ  - ఉర్దూ, హిందీ పదం. 

*మహేంద్రుడు - దేవతలకి అధిపతి ఇంద్రుడు. (హిందూ పురాణాల ప్రకారం)

*ఐరావతం - ఇంద్రుడి వాహనం 

*వరుణుడు - వర్షాన్ని కురిపించేవాడు. వాయువ్య దిక్కుకి అధిపతి. ఇంద్రుడి ఆజ్ఞను అనుసరించేవాడు.

06 June 2026. 02:30 pm. 

©️Vanaja Tatineni


English Translation: 'Waiting'*


*Waiting*


Hey Mahendra!  

Hold on a moment, my friend... 

don't rush away on your Airavata in such a hurry.  

Just listen to us. Tell me truly, when will you send _him_?  

We are waiting for him.  

He may or may not come... but he teases us daily,  

As if to say, "Shall I come now? Or after a while?"  

He always comes only at midnight, finishes his work, and leaves.  

After he comes and goes, how pristine the mornings are!  

Everyone you see is radiant with smiles, filled with new hopes,  

Chatting away with others about this and that.  

He may be singular, but he flourishes eternally as a plural.  

He keeps wandering, searching for a place he likes. 

He stays as long as he pleases. Whatever it is...  

I wish he would just come without fail, without faltering.  

Then I wouldn't have to struggle to get my daughter married. 

My son's education would fall into place.  

The price of a pot of water and the price of gold are both 

growing taller than a palmyra tree, day by day.  

If he comes... our anxiety will cool down, 

and our fight for life will begin.  

I am waiting for him to come.  

Everyone is waiting!  

Believing he will come, 

I have even ploughed the field and kept it ready 

without fearing the scorching sun, to sow the seedlings.  

Tell me, when will he come?  

Hey, tell me when you will send that Varuna!




కామెంట్‌లు లేవు: