12, జూన్ 2026, శుక్రవారం

శూన్య వైశాల్యం, సగం లెక్క

 



Vanaja Verses 


శూన్య వైశాల్యం


నీకు హృదయ వైశాల్యం యెక్కువ అన్నారు 

నింపడానికి ఏమీ లేనప్పుడు 

ఒక ప్రదేశం చిన్నగా ఎలా అనిపిస్తుంది. 


*********

సగం లెక్క 


డజను సార్లు వర్ష రుతువులు వచ్చి పోయాయి. 

వానలో నడుస్తూ అడుగులు లెక్కపెడుతున్నా. 

ఎన్ని సార్లు కొలిచినా లెక్క సగమే వస్తుంది. 

రెండు కాళ్లు మాత్రమే నడిస్తే  దూరమెలా తరుగుతుంది. 

కలలు అలలు వానలు సంతలు వస్తూ పోతూనే వుంటాయి. 

వలస పక్షులు కూడా రావచ్చు.

కానీ.. నువ్వు తిరిగి రావు. 

కామెంట్‌లు లేవు: