29, అక్టోబర్ 2026, గురువారం

వెన్నెముక

 వెన్నెముక

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా..
చిటుకు చిటుకు మంటూ చిరు కవిత్వం రాస్తావు
ఎలా ఇంత స్థితప్రజ్ఞత !!
నిన్ను చూస్తే అసూయగా వుంది అంటావు
అసలు రహస్యం చెప్పనా!? 

ఉదయాన్నే శుభోదయం చెప్పినట్లే
రాత్రి సమయంలో కనీసం కలలోకైనా వచ్చి
ఆత్మీయంగా తల నిమిరి భరోసానిస్తావు
నా పగటి దిగుళ్ళని బాధల్ని  వానకారు మేఘమల్లే 
నువ్వు మోసుకెళతావు;మరుసటి ఉదయానికల్లా 
నీ ప్రేమని ఉక్కు కవచంలా తొడుక్కుంటాను
నాలోని స్థైర్యం దైర్యం సమైక్యదృష్టి అన్నీ నువ్వే
నా వెన్నెముక నువ్వు

29/10/2026. 05:05 am

కామెంట్‌లు లేవు: